14 కి.మీకి రూ.4 వేలు.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో కంటెంట్‌ క్రియేటర్‌కు షాక్!

బెంగళూరు: మూడేళ్ల విదేశీ ప్రయాణం తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన యూకేకు చెందిన కంటెంట్‌ క్రియేటర్‌ అభీష్ణ ఎన్‌కు బెంగళూరు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. నగరానికి కొత్త కావడంతో స్థానిక రవాణా విధానాలపై అవగాహన లేకపోవడాన్ని ఓ ట్యాక్సీ డ్రైవర్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నాడని ఆమె ఆరోపించారు. ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌ ఎక్కే ముందు ఛార్జీ ఎంత అని డ్రైవర్‌ను అడగగా.. మీటర్‌ ప్రకారమే డబ్బులు తీసుకుంటానని చెప్పడంతో ఆమె నమ్మి ట్యాక్సీ ఎక్కారు. అయితే కేవలం 14 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.4,000 వసూలు చేసినట్లు తెలిపారు. మొదట ఎయిర్‌పోర్టు ట్యాక్సీలకు ఇంతే ఛార్జీ ఉంటుందని భావించి డబ్బులు చెల్లించిన ఆమె.. తర్వాత రసీదును...