ఎవరెస్ట్‌ ఇంగువపై నిషేధం.. నాణ్యత లోపాలపై FSSAI చర్యలు

ముంబై: ప్రముఖ మసాలా తయారీ సంస్థ ఎవరెస్ట్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌కు చెందిన ఇంగువ ఉత్పత్తిపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నిషేధం విధించారు. సంస్థ తయారు చేస్తున్న కొన్ని మసాలా ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎవరెస్ట్‌ సంస్థకు చెందిన ఉత్పత్తుల నమూనాలను అధికారులు సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో ఇంగువతో పాటు గరం మసాలా, చికెన్‌ మసాలా, ఎగ్‌ కర్రీ మసాలా ఉత్పత్తుల్లోనూ నాణ్యతకు సంబంధించిన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఉత్పత్తుల ప్యాకెట్లపై ఉప్పు శాతం, మసాలా దినుసుల అసలు కంటెంట్‌ వంటి వివరాలను నిబంధనల ప్రకారం...