భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం: మంత్రి పొంగులేటి

సూర్యాపేట: గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూముల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సూర్యాపేటలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో శనివారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, సర్వే, గృహ నిర్మాణ శాఖల సమీక్ష సమావేశానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సుమారు 125 ఏళ్ల క్రితం భూ సర్వే జరిగిందని, ఆ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో సర్వే...