“జీవితంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది”.. సంజూపై సూర్యకుమార్ ప్రశంసలు

న్యూఢిల్లీ: 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయానికి కీలకంగా నిలిచిన సంజూ శాంసన్‌ వ్యక్తిత్వంపై మాజీ టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచకప్‌ తుది జట్టు నుంచి సంజూను తప్పించాల్సి వచ్చిన సమయంలో అతడు స్పందించిన తీరు తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు. ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సంజూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతడిని పక్కనపెట్టి ఇషాన్‌ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకున్నామని సూర్య తెలిపాడు. ఈ విషయాన్ని సంజూకు ఎలా చెప్పాలో కూడా తనకు అర్థం కాలేదని పేర్కొన్నాడు. అయితే బస్సులో ఈ విషయాన్ని సంజూతో చెప్పినప్పుడు అతడు ఎంతో పరిపక్వతతో స్పందించాడని సూర్య గుర్తుచేశాడు. “ప్రపంచకప్‌...