బిర్యానీ పాత్రలో మనిషి శరీర భాగాలు.. భార్యాభర్తల అరెస్టు

చెన్నై: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో సూట్‌కేస్‌లో మనిషి శరీర భాగాలు లభించిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మణిపుర్‌లో నిందితులైన మాణిక్‌ ఉత్తిన్‌ లస్కర్‌, అతని భార్య భాగమతి మాజీని శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో.. చెన్నై గూడువాంజేరిలో హైతుల్లా నిషా (38) అనే మహిళ హత్యకు గురైనట్లు గుర్తించారు. ఆమెతో మాణిక్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిషా గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. అబార్షన్‌ చేయించుకోవాలని మాణిక్‌ చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయం మాణిక్‌ భార్య భాగమతికి తెలియడంతో దంపతుల మధ్య నిషా విషయంలో గొడవలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం నిషాతో మాట్లాడేందుకు వెళ్లిన...