తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత రవిచంద్ర..

మహమ్మద్ తాజుద్దీన్ ‌కుటుంబ సభ్యులకు ధైర్యం.. వారి పిల్లలకు అండగా ఉంటామని ఎంపీ రవిచంద్ర భరోసా.. ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు, 30: ఖమ్మం: ఇటీవల మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తాజుద్దీన్ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తాజుద్దీన్ పార్టీ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిన చురుకైన నాయకుడు అని, ఖమ్మం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారని రవిచంద్ర గుర్తు చేసుకున్నారు....