పొలం గట్టున ఆత్మీయ పలకరింపు..

శ్రమజీవుల చెంతకు చేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు,30 : మండుటెండను సైతం లెక్కచేయకుండా రోజంతా పొలంలో చెమటోడ్చి పనిచేసిన ఆ శ్రమజీవులకు.. ఆదివారం ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట శివారుల్లో కనిపించిన ఓ అరుదైన దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.. హంగూ ఆర్భాటాలకు దూరంగా, నేరుగా పంట పొలాల్లో కూలీ పనులు చేస్తున్న మహిళల వద్దకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతూ క్యారేజీలు విప్పుకుంటున్న ఆడబిడ్డల మధ్యకు ఆయన ఓ సొంత అన్నలా అడుగులు వేశారు....