జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం
-ఇండ్ల స్థలాలు, సంక్షేమం కోసం పోరాటం -అక్టోబర్ లో పోరాట కార్యాచరణ -సెప్టెంబర్ లో సభలు, సమావేశాలు -ఐజెయు సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్ ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు: 30: ఖమ్మం : జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జర్నలిస్టులను సమీకరించి పోరుబాట పడతామని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్ హెచ్చరించారు. జర్నలిస్టులు ఎప్పుడు అడిగిన ప్రభుత్వం కాదనడం లేదని కానీ పని కూడా పూర్తి చేయడం లేదని ఖమ్మంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం ఉండి అర్హులైన జర్నలిస్టుల జాబితా అధికారుల వద్ద ఉన్నా కూడా -నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు....