ప్రపంచానికే ప్రళయం వచ్చినా.. ఆస్ట్రేలియా తట్టుకుని నిలబడుతుందట!
ప్రపంచవ్యాప్తంగా భారీ విపత్తు సంభవించి మానవ నాగరికతకు ముప్పు వాటిల్లితే ఏ దేశం ఎక్కువగా తట్టుకుని నిలబడగలదనే అంశంపై జర్మనీలోని హేగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచ విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యంలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు, గ్రహశకలాల దాడులు, అణుయుద్ధం, మహమ్మారులు, భారీ సైబర్ దాడులు వంటి పరిస్థితుల్లో ఆహారం, విద్యుత్, రవాణా, పరిశ్రమలు వంటి కీలక వ్యవస్థలను కొనసాగించగల సామర్థ్యాన్ని పరిశోధకులు పరిశీలించారు. ద్వీప ఖండం కావడం, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, బలమైన పారిశ్రామిక రంగం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు ఆస్ట్రేలియాకు ప్రధాన బలాలుగా ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా తర్వాత...