మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర.. సీఎం చంద్రబాబు
అమరావతి: మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుందని, మార్కాపురం జిల్లా గంటవానిపల్లిలో సోమవారం కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుందని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 1996లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు తొలి దశ పూర్తవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. వెలిగొండ కేవలం నీటి ప్రాజెక్టు మాత్రమే కాదని.. కరవుతో పోరాడుతున్న రైతులకు భరోసా, ఫ్లోరైడ్ బాధితులకు ఆరోగ్య రక్షణ, వలస వెళ్లిన యువతకు సొంత ప్రాంతంలో ఉపాధి, వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి మార్గం అని పేర్కొన్నారు. వెలిగొండ ఫేజ్-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు...