వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్.. హెడ్ రెగ్యులేటర్కు చేరిన కృష్ణా జలాలు!
ప్రకాశం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ట్రయల్ రన్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. కొల్లం వాగు వద్ద అధికారులు గేట్లు ఎత్తి కృష్ణా జలాలను సొరంగంలోకి విడుదల చేయగా.. నీరు గంటవానిపల్లి క్రాస్ హెడ్ రెగ్యులేటర్కు చేరుకుంది. ట్రయల్ రన్ సందర్భంగా గేట్ల పనితీరు, సొరంగంలో నీటి ప్రవాహ వేగం, నీటి తరలింపు ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. ముందుజాగ్రత్తగా హెడ్ రెగ్యులేటర్ వద్ద సైరన్ మోగించి సమీప ప్రజలను అప్రమత్తం చేశారు. సోమవారం సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం ముందు భాగం నుంచి సుమారు 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను తరలించి...