భారత్–ఉజ్బెకిస్తాన్ మధ్య కీలక ఒప్పందాలు

ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా భారత్‌, ఉజ్బెకిస్తాన్‌ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అణుశక్తి అవసరాల కోసం యురేనియం సరఫరాకు విధానం ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 1 బిలియన్‌ డాలర్లకు పైగా వాణిజ్యం జరుగుతోంది. దీనిని 2030 నాటికి ఏటా 5 బిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంధనం, కీలక ఖనిజాలు, మౌలిక సదుపాయాలు, రక్షణ, సాంకేతికత, ఔషధాలు, వ్యవసాయం, ఆభరణాల రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. అలాగే AI, అంతరిక్షం, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, అణుశక్తి, స్టార్టప్‌లు వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉజ్బెక్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో...