ఫుల్లుగా మందుకొట్టి నీట్ పీజీ పరీక్షకు వచ్చిన విద్యార్థి
తెలంగాణలో ఆదివారం జరిగిన నీట్ పీజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని ఓ పరీక్షా కేంద్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన మహ్మద్ రిజ్వాన్ అనే విద్యార్థి మద్యం సేవించి పరీక్షా కేంద్రానికి వచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. సెక్యూరిటీ తనిఖీలను దాటుకుని పరీక్ష హాల్లోకి వెళ్లిన అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడి నుంచి మద్యం వాసన రావడంతో పరీక్ష రాసేందుకు అనర్హుడిగా గుర్తించి హాల్ నుంచి బయటకు పంపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ...