ఆంధ్రా అబ్బాయితో అమెరికాలో కుమార్తె పెళ్లి.. ఆన్‌లైన్‌లో అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు!

అమెరికాలో జరిగిన తమ ఏకైక కుమార్తె వివాహానికి వీసా సమస్యల కారణంగా తల్లిదండ్రులు హాజరు కాలేకపోయారు. దీంతో వీడియో కాల్ ద్వారా పెళ్లి వేడుకను వీక్షించి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల కుమార్తె హిమబిందు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో అమెరికాలోనే వీరి వివాహం జరిగింది. కూతురి పెళ్లిని దగ్గరుండి జరిపించాలని భావించిన తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, చివరి నిమిషంలో వీసా సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రయాణం నిలిచిపోయింది. అయితే టెక్నాలజీ సాయంతో వారు పెళ్లి...