పవర్ బ్యాంక్‌తో ఆటలొద్దు.. ప్రాణాలకే ముప్పు!
పవర్ బ్యాంక్ పేలుళ్లతో అప్రమత్తం కావాల్సిన పరిస్థితి నాసిరకం బ్యాటరీలు, అధిక వేడి, తప్పు ఛార్జింగ్ విధానాలే ప్రధాన కారణాలు మొబైల్ ఫోన్‌కు అత్యవసర సమయంలో ఛార్జింగ్ అందించే పవర్ బ్యాంక్ ఇప్పుడు చాలామందికి నిత్యావసర పరికరంగా మారింది. అయితే నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే అదే పరికరం ప్రమాదకరంగా మారొచ్చు. లిథియం-అయాన్ బ్యాటరీల్లో లోపాలు, నాసిరకం ఉత్పత్తులు, తప్పు ఛార్జింగ్ పద్ధతుల కారణంగా పవర్ బ్యాంక్‌లు పేలుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సూరత్‌కు చెందిన ఓ మహిళ పవర్ బ్యాంక్‌ను ఛార్జింగ్‌కు పెట్టి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేలోపు అది పేలడంతో గది మొత్తం కాలిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది....