లారక్ ద్వీపంపై అమెరికా దాడి.. ఇరాన్ భగ్గుమంటోంది!
హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రతీకారం తప్పదన్న ఐఆర్జీసీ టెహ్రాన్: అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇరాన్కు చెందిన వ్యూహాత్మక లారక్ ద్వీపంపై అమెరికా సైనిక దళాలు డ్రోన్ దాడులు నిర్వహించాయి. హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్లను అమర్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడిలో రెండు ఇరానియన్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళాలు మైన్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించామని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలను కాపాడేందుకు చర్యలు కొనసాగుతాయని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు అమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది...