హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం!
మోదీ స్టేడియాన్ని మించేలా నిర్మాణం.. 100 ఎకరాల్లో భారీ క్రీడా ప్రాంగణం హైదరాబాద్: తెలంగాణ రాజధానికి మరో భారీ క్రీడా మణిహారం రానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో అధికారులు ఇప్పటికే అనువైన స్థలం కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియం 1.32 లక్షల సీట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది. దీనిని మించే సామర్థ్యంతో కొత్త స్టేడియాన్ని నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు...