ఫోన్ కనిపించకపోతే గుబులు.. నోమోఫోబియాతో జనం!
పిల్లల నుంచి పెద్దల దాకా మొబైల్ బానిసత్వం.. గంటల తరబడి స్క్రీన్ ముందే ముదిరితే నిద్రలేమి, ఆందోళన.. మానసిక, శారీరక సమస్యలకు దారితీసే ప్రమాదం హైదరాబాద్: ఒకప్పుడు నిద్రలేవగానే కుటుంబ సభ్యులను చూసేవాళ్లు. ఇప్పుడు చాలామందికి కళ్లు తెరవగానే చేతిలోకి తీసుకునేది మొబైల్ ఫోన్. బ్రష్ చేస్తున్నా, తింటున్నా, ప్రయాణిస్తున్నా.. చివరికి నిద్రకు ముందు కూడా ఫోన్ వదలని పరిస్థితి నెలకొంది. ఒక్క క్షణం ఫోన్ కనిపించకపోయినా ఆందోళనకు గురికావడం, బ్యాటరీ తగ్గినా టెన్షన్ పడటం, నెట్ లేకపోతే చిరాకు రావడం వంటి లక్షణాలను **నోమోఫోబియా (నో మొబైల్ ఫోన్ ఫోబియా)**గా నిపుణులు పేర్కొంటున్నారు. రోజులో గంటల తరబడి ఫోన్తోనే.. స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడంతో పిల్లలు,...