వెలిగొండపై రాజకీయ వేడి.. జగన్ వ్యాఖ్యలకు లోకేశ్ కౌంటర్
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు ముదిరాయి. ప్రాజెక్టు నిర్మాణ ఘనతపై మాజీ సీఎం వైఎస్ జగన్, మంత్రి నారా లోకేశ్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టును తమ హయాంలోనే కీలక దశకు తీసుకెళ్లామని జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ స్పందించారు. 2024లో వైసీపీ ప్రభుత్వం నీరు అందుబాటులోకి రాకముందే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసిందని ఆయన ఆరోపించారు. అప్పట్లో సొరంగాల పనులు పూర్తయ్యాయని చెబుతూ నిర్వహించిన కార్యక్రమంలో వాస్తవంగా నీటి ప్రవాహం లేదని విమర్శించారు. తాజాగా తన ఎక్స్ ఖాతాలో లోకేశ్ పలు ఫొటోలను పోస్టు చేస్తూ.. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల...