నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. 24,100 దిగువకు నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉండటంతో పాటు ఐటీ, మెటల్, రియల్టీ, మీడియా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందికి లాగింది. రోజు ముగిసే సమయానికి సెన్సెక్స్ 307.24 పాయింట్లు కోల్పోయి 76,957.27 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95.25 పాయింట్లు తగ్గి 24,080.40 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఎటర్నల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, మెటల్, రియల్టీ, మీడియా సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీనికి భిన్నంగా ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు కొంత మద్దతు ఇచ్చాయి. మిడ్క్యాప్ సూచీ 0.24 శాతం పెరగగా, స్మాల్క్యాప్ సూచీ 0.74...