వెలిగొండపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. వైసీపీపై తీవ్ర విమర్శలు

మూడు దశాబ్దాల కల సాకారం.. వెలిగొండ తొలి దశ ప్రారంభం ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తూ సీఎం చంద్రబాబు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేశారు. నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు భావోద్వేగంగా మాట్లాడారు. 1996 మార్చి 5న తానే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, 30 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా 2026 ఆగస్టు 31న ప్రాజెక్టును ప్రారంభించడం తన అదృష్టమని చంద్రబాబు అన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై ఫైర్ వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందని...