జీఎస్టీ 2.0 లేకుంటే ఆర్థిక పరిస్థితి మరింత దారుణం: మారుతి చైర్మన్
పన్ను సంస్కరణలతో చిన్న కార్ల మార్కెట్కు భారీ ఊతం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు లేకపోతే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేదని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ అన్నారు. సోమవారం జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంలా పనిచేశాయని భార్గవ పేర్కొన్నారు. ఈ మార్పుల ప్రభావం కేవలం ఆటోమొబైల్ రంగానికే పరిమితం కాలేదని, అనేక ఇతర రంగాలకు కూడా ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ప్రత్యేకంగా చిన్న కార్ల మార్కెట్ గత ఐదేళ్ల వృద్ధితో పోలిస్తే...