సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. హేగ్ తీర్పును ఖండించిన కేంద్రం
తమ సార్వభౌమ హక్కులను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్న భారత్ న్యూఢిల్లీ: సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి హేగ్లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఈ వ్యవహారంలో తీర్పు ఇచ్చే అధికారం ఆ కోర్టుకు లేదని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఏర్పాటైన ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను భారత్ మొదటి నుంచీ గుర్తించలేదని పేర్కొంది. భారత్ అభ్యంతరాలివే.. ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ వ్యవస్థ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా ఉందని భారత్ అభ్యంతరం కోర్టు విచారణలో భారత్ పాల్గొనలేదని విదేశాంగ శాఖ వెల్లడి దేశ సార్వభౌమ నిర్ణయాలపై ఆ సంస్థకు ఎలాంటి అధికార...