పెట్రోల్‌లో ఇథనాల్ ఎంత?.. కీలక పిల్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం
ఇంధన వివరాలు బంకులు, రశీదులపై ముద్రించాలన్న డిమాండ్‌కు నో న్యూఢిల్లీ: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ పరిమాణాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ అంశంపై పిటిషనర్ సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. న్యాయవాది ఎన్.కె. గోస్వామి దాఖలు చేసిన పిటిషన్లో పెట్రోల్ నాజిళ్లతో పాటు వినియోగదారులకు ఇచ్చే రశీదులపై ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా పేర్కొనేలా ఆదేశించాలని కోరారు. అలాగే ఏ వాహనాలు ఏ స్థాయి ఇథనాల్ కలిగిన పెట్రోల్‌కు అనుకూలంగా ఉంటాయో తెలియజేసే అధికారిక డేటాబేస్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. పిటిషన్లో ప్రధాన డిమాండ్లు పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని...