విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై దుమారం.. మిత్రపక్షాల మధ్య ముదిరిన విభేదాలు
రాహుల్ గాంధీయే మా ప్రధాని అభ్యర్థి: కాంగ్రెస్.. టీవీకే ప్రచారంపై డీఎంకే ఎద్దేవా చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో 2029 లోక్సభ ఎన్నికల ప్రధాని అభ్యర్థిత్వం అంశం కొత్త వివాదానికి తెరతీసింది. ముఖ్యమంత్రి విజయ్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా టీవీకే నేతలు ప్రచారం చేస్తుండటంపై కాంగ్రెస్, డీఎంకే నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారం అధికార కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలను బయటపెట్టింది. ఇటీవల తిరుప్పూర్లో జరిగిన సమావేశంలో టీవీకే సీనియర్ నేత, రెవెన్యూ శాఖ మంత్రి కే.ఏ. సెంగొట్టయన్.. విజయ్ దేశాన్ని సమర్థంగా నడిపించగల నాయకుడని వ్యాఖ్యానించారు. ఆయన నాయకత్వ సామర్థ్యం ఎంజీఆర్, జయలలితల కంటే ఎక్కువగా ఉంటుందని ప్రశంసించారు. అంతేకాకుండా, టీవీకే అంతర్గత సర్వేలో 2029...