ఇరాన్ అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ.. యుద్ధం తర్వాత తొలిసారి ముఖాముఖి చర్చలు
పశ్చిమాసియా పరిణామాలపై చర్చకు ప్రాధాన్యం.. హర్మూజ్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం బిష్కెక్: కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరాన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, పెజెష్కియాన్ నేరుగా భేటీ కావడం ఇదే తొలిసారి. సమావేశంలో చర్చించిన అంశాలపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. అయితే హర్మూజ్ జలసంధి విషయంలో నెలకొన్న పరిణామాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రాంతీయ స్థిరత్వం, వాణిజ్య మార్గాలు, భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధంపై...