వెలిగొండ సభలో చంద్రబాబు జోష్.. ర్యాంప్‌పై నడుస్తూ సందడి

పచ్చ కండువా తిప్పుతూ ప్రజలకు అభివాదం.. కేరింతలతో మార్మోగిన సభా ప్రాంగణం మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు సభలో ఉత్సాహంగా కనిపించారు. వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై ఆయన నడుస్తూ ప్రజలను ఉత్సాహపరిచారు. చేతిలోని పచ్చ కండువాను గాల్లో తిప్పుతూ సభకు హాజరైన రైతులు, ప్రజలకు అభివాదం చేశారు. చంద్రబాబు ఉత్సాహాన్ని చూసిన టీడీపీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున కేరింతలు, చప్పట్లతో స్పందించారు. పలువురు తమ పచ్చ కండువాలను ఊపుతూ ఆయనతో కలిసి సందడి చేశారు. మూడు దశాబ్దాల తర్వాత నెరవేరిన కల...