‘రోమాంచకం’ ట్రైలర్కు అదిరిపోయే స్పందన.. యువతను ఆకట్టుకుంటున్న కామెడీ
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో కొత్త తరహా రొమాంటిక్ ఎంటర్టైనర్ హైదరాబాద్: ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి ఇంటెన్స్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్కుమార్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల కాగా.. సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల తరహా హింసాత్మక అంశాలకు భిన్నంగా ‘రోమాంచకం’ ట్రైలర్ను పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందించారు. డేటింగ్ యాప్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో పాటు కామెడీ, ఫ్రెండ్షిప్, అనూహ్య పరిణామాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కథ ఏంటంటే.. డేటింగ్ యాప్...