‘టాక్సిక్‌’పై రాజాసింగ్‌ తీవ్ర ఆగ్రహం.. “అలాంటి సన్నివేశాలు చూడలేక బయటకు వచ్చేశా”

హింస, అశ్లీలతకు బదులు సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావాలని సూచన హైదరాబాద్‌: యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్‌’ సినిమాపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సినిమాల్లో హింస, అశ్లీలతను ప్రధానంగా చూపించకుండా సమాజానికి ఉపయోగపడే కథలను తెరకెక్కించాలని రాజాసింగ్‌ సినీ దర్శకులు, నిర్మాతలకు సూచించారు. ధర్మం, భక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించేలా చిత్రాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. మధ్యలోనే థియేటర్‌ నుంచి బయటకు.. ‘టాక్సిక్‌’ సినిమా చూసేందుకు తాను థియేటర్‌కు వెళ్లానని రాజాసింగ్‌ తెలిపారు. అయితే సినిమాలోని కొన్ని అశ్లీల, హింసాత్మక సన్నివేశాలు...