ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్‌స్టార్లు.. ‘బిగ్ బాస్’ కొత్త ప్రోమో వైరల్

నాగార్జున, మోహన్‌లాల్, సుదీప్, విజయ్ సేతుపతి ఫుడ్ మిక్సప్‌తో సందడి హైదరాబాద్‌: దక్షిణాది ప్రేక్షకులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ ‘బిగ్ బాస్’ నిర్వాహకులు కొత్త ప్రోమోను విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో షోకు హోస్టులుగా వ్యవహరిస్తున్న నాగార్జున, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. సోమవారం విడుదలైన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, ఆహారపు అలవాట్లను ప్రధానంగా తీసుకుని ఈ ప్రోమోను రూపొందించారు. ఒక్కో రాష్ట్రానికి చెందిన వంటకాలు మరో రాష్ట్రానికి చేరడంతో ఏర్పడిన గందరగోళం, నలుగురు స్టార్ల మధ్య జరిగే సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అభిమానులకు...