రేవంత్‌ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదా?.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

శాఖలపై మంత్రులకు పూర్తి అధికారం ఉండాలి.. లేకపోతే ప్రభుత్వానికే సమస్యలంటూ హెచ్చరిక హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లోని మంత్రులకు తమ శాఖలపై పూర్తి స్వేచ్ఛ, అధికారం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు తమ శాఖల వ్యవహారాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. మంత్రులకు తగిన స్వేచ్ఛ లేకపోతే భవిష్యత్‌లో అనేక సమస్యలు తలెత్తి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూనంనేని హెచ్చరించారు. సీఎంపై వ్యక్తిగత విమర్శలు వద్దు సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపైనా కూనంనేని స్పందించారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై రాజకీయ విమర్శలు...