‘పుట్టింటి నుంచే నన్ను బయటకు పంపారు’.. సభలో కన్నీళ్లు పెట్టుకున్న కవిత

బీఆర్ఎస్‌ నుంచి సస్పెన్షన్‌పై భావోద్వేగం.. కొత్త పార్టీ ఎందుకు పెట్టానో వివరించిన నేత నిజామాబాద్‌: బీఆర్ఎస్‌ నుంచి తనను సస్పెండ్‌ చేయడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సభలో ప్రసంగిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం తాను జైలుకు వెళ్లానని పెద్ద నాయకులే చెప్పారని, కానీ చివరకు అదే పార్టీ నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. “నాతో ఎందుకు ఇలా చేయాలి?” అంటూ కవిత కన్నీళ్లు పెట్టుకోవడంతో సభలోని మహిళలు, కార్యకర్తలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలు “కవిత సీఎం.. సీఎం” అంటూ నినాదాలు చేశారు. పుట్టింటి ఆదరణ దక్కలేదంటూ.. సొంతంగా...