15 ఏళ్లకే దుమ్మురేపాడు.. దులీప్‌ ట్రోఫీలో 57 ఏళ్ల రికార్డు బద్దలు

42 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి రికార్డుల పుస్తకాల్లోకి ఎక్కాడు. దులీప్‌ ట్రోఫీ 2026 సెమీఫైనల్లో సెంట్రల్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌ తరఫున ఆడిన వైభవ్‌.. అత్యంత పిన్న వయసులో అర్ధశతకం సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 175 రోజుల వయసులో వైభవ్‌ ఈ ఘనత సాధించాడు. 42 బంతుల్లోనే సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 1969లో లక్ష్మణ్‌ సింగ్‌ నెలకొల్పిన 57 ఏళ్ల రికార్డు తెరమరుగైంది. అప్పట్లో లక్ష్మణ్‌ సింగ్‌ 16 ఏళ్ల 23 రోజుల వయసులో...