హైదరాబాద్కు కొత్త రూపు.. GHMC, CMC, MMC కొత్త లోగోలు ఆవిష్కరణ
మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక గుర్తింపు.. లోగోలను విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో వాటికి కొత్త గుర్తింపును తీసుకొచ్చారు. GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)లకు రూపొందించిన కొత్త లోగోలను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో పాటు.. ఒక్కో సంస్థకు ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ (CURE)గా పరిగణిస్తూ పాత GHMCని పునర్విభజించారు. GHMC పరిధి కొత్త GHMCలో...