బెల్జియం చేతిలో భారత్‌కు షాక్.. హాకీ వరల్డ్‌కప్‌లో 8వ స్థానంతో సరి!
షూటౌట్లో 4–3 తేడాతో ఓటమి.. చివరి క్షణంలో హర్మన్‌ప్రీత్ గోల్‌తో ఉత్కంఠ వావ్రే (బెల్జియం): హాకీ వరల్డ్‌కప్ 2026లో భారత జట్టు ఎనిమిదో స్థానంతో టోర్నీని ముగించింది. శుక్రవారం వావ్రేలోని బెల్ఫియస్ హాకీ అరెనాలో జరిగిన పోరులో ఆతిథ్య బెల్జియం షూటౌట్లో 4–3 తేడాతో భారత్‌ను ఓడించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 3–3తో సమంగా నిలవడంతో విజేతను షూటౌట్ ద్వారా నిర్ణయించారు. మ్యాచ్ ప్రారంభంలోనే అభిషేక్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. మన్‌ప్రీత్ సింగ్ అందించిన పాస్‌ను అందుకున్న అభిషేక్ బలమైన షాట్‌తో బెల్జియం గోల్కీపర్ను బోల్తా కొట్టించి గోల్ సాధించాడు. అయితే రెండో క్వార్టర్లో బెల్జియం పుంజుకుంది. రొమాన్ డువెక్సాట్ 22వ...