ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు 31: ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు జిల్లాలో ఉన్న విద్య, వైద్య, ఇతర అంశాలను సూచిస్తూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా, జిల్లా పరిధిలో సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని...