నీళ్లు లేకుండా 40 ఏళ్లుగా వ్యవసాయం.. అమెరికా రైతు అద్భుతం!

అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన ఓ రైతు నీటి చుక్క కూడా ఉపయోగించకుండా ఏకంగా 40 ఏళ్ల పాటు వ్యవసాయం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. భూమిలో సహజంగా నిల్వ ఉండే తేమను మాత్రమే ఆధారంగా చేసుకుని టమాటాలు, బంగాళదుంపలు, వెల్లుల్లి, గుమ్మడి వంటి పలు రకాల పంటలను విజయవంతంగా సాగు చేశారు. 1974 నుంచి 2014 వరకు ఆయన ఈ విధానంలో వ్యవసాయం కొనసాగించారు. 2007లో ఒరెగాన్‌లోని వెనెటా సమీపంలో 9.6 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆయనకు ఆ భూమిపై ఎలాంటి సాగునీటి హక్కులు లేవు. అయినప్పటికీ తన కుటుంబ అవసరాలకు సరిపడా ఆహారాన్ని పండించడంతో పాటు, అదనపు దిగుబడిని స్థానిక మార్కెట్లలో విక్రయించారు....