2027 వన్డే ప్రపంచకప్‌కు తిలక్ వర్మను సిద్ధం చేస్తున్న టీమిండియా.. శ్రేయస్ అయ్యర్‌కు పెరిగిన పోటీ!
హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి సారించింది. నంబర్-4 స్థానంలో కీలకంగా ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ యువ బ్యాటర్ తిలక్ వర్మను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొత్త కాంబినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనతో పాటు అతడి ఫిట్నెస్, ఫీల్డింగ్ సామర్థ్యాలను టీమ్ మేనేజ్మెంట్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టాప్-6లో లెఫ్ట్‌హ్యాండర్ లేకపోవడం తిలక్ వర్మకు అదనపు ప్రయోజనంగా మారింది. హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయాల నేపథ్యంలో...