వెలిగొండ ప్రాజెక్టుతో కూటమి సంకల్ప బలం చాటాం: పవన్ కల్యాణ్
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏదైనా సంకల్పిస్తే దాన్ని ఎలా సాకారం చేస్తుందో వెలిగొండ ప్రాజెక్టు పూర్తే నిదర్శనమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం కేరళలో ఉన్న ఆయన.. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి జాతికి అంకితం చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో స్పందించారు. 30 ఏళ్ల ప్రజల కలను వెలిగొండ ప్రాజెక్టు సాకారం చేసిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు అధికారం అప్పగించారని.. వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ తెలిపారు. వెలిగొండ తొలి దశ పూర్తవడంతో కృష్ణా జలాలు కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్నాయని, ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు....