వైసీపీలో ముదురుతున్న వర్గపోరు.. శ్రీకాకుళంలో సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు?

శ్రీకాకుళం: వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో నేతలంతా ఐక్యంగా పనిచేయాలని అధినేత వైఎస్ జగన్ సూచిస్తున్నప్పటికీ.. కొన్ని జిల్లాల్లో సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తాజాగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. జిల్లాపై పక్క జిల్లాల నేతల పెత్తనం అవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నాయి. ‘‘ఎవరి తల వాళ్లు దువ్వుకుంటే పాపిట సరిగ్గా ఉంటుంది.. పక్కవాళ్లు దువ్వితే వంకరగా ఉంటుంది’’...