వెలిగొండతో కూటమికి రాజకీయ లాభమా?.. సాగునీటితో ఓటు బ్యాంకు బలోపేతం?
వెలిగొండతో కూటమికి రాజకీయ లాభమా?.. సాగునీటితో ఓటు బ్యాంకు బలోపేతం? అమరావతి: దశాబ్దాలుగా కరవుతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు నీటిని అందుబాటులోకి తీసుకురావడంతో దీని ప్రభావం కేవలం వ్యవసాయానికే పరిమితం కాకుండా రాజకీయంగానూ ఉండొచ్చన్న చర్చ మొదలైంది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు మండలాలకు ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం కలగనుండటంతో ఆయా ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వెలిగొండ తొలి దశ ద్వారా సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో ఇప్పటివరకు వర్షాధారంగా సాగు చేస్తున్న రైతులకు నీటి భరోసా పెరగనుంది. మరోవైపు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు 4...