గుడివాడ వైసీపీలో అయోమయం.. కొడాలి నానిపైనే కేడర్ ఆశలు!

గుడివాడ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుడివాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఆధిపత్యం ప్రదర్శించిన వైసీపీ.. ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయగలదా అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. మరోవైపు అధికార కూటమి గుడివాడ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశముంది. గత మున్సిపల్ ఎన్నికల్లో గుడివాడలోని మొత్తం 31 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో ఈసారి కూడా పట్టణంపై పట్టు నిలుపుకోవడం ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులు వైసీపీ నేతలకు సవాలుగా మారుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో లేని నేత.. కేడర్‌లో...