కేసీఆర్ పాలనపై రేవంత్ ఫైర్.. ‘‘పదేళ్లలో చేయనిది రెండేళ్లలో చేశాం’’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పలు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేసిందని అన్నారు. హైదరాబాద్లోని అంబర్పేట–మూసారాంబాగ్ మధ్య మూసీ నదిపై నిర్మించిన నూతన వంతెనను సోమవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్రెడ్డి.. వర్షాలు కురిసిన ప్రతిసారీ నీట మునిగే పాత వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంపై గత ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. అంబర్పేటలో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో పాటు 10 ఎకరాల స్థలంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. బతుకమ్మ కుంటను ఆక్రమించే ప్రయత్నాల...