ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ వ్యవహారం.. ఎంఐఎంకు కొత్త చిక్కులు!

హైదరాబాద్: ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వ్యవహారం ఎంఐఎం పార్టీలో కలకలం రేపుతోంది. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదన్న ప్రచారం నేపథ్యంలో తదుపరి చర్యలపై మజ్లిస్ నాయకత్వం దృష్టి పెట్టింది. రహ్మత్ బేగ్‌పై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎంఐఎం అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను...