మూడు దశాబ్దాల ప్రాజెక్టుకు మళ్లీ బాబే ప్రారంభకుడు.. సీఎంగా అరుదైన రికార్డు!

అమరావతి: రాజకీయాల్లో పదవులు, అవకాశాలు ఒకేసారి కలిసి రావడం అరుదు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, పరిపాలనా అనుభవంతో పాటు తాను గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే తిరిగి పూర్తి చేసి ప్రారంభించే అవకాశం రావడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా మారింది. వెలిగొండ ప్రాజెక్టు ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది. వెలిగొండతో ప్రత్యేక అనుబంధం వెలిగొండ సాగునీటి ప్రాజెక్టుకు 1996లో శ్రీకారం చుట్టారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసి నీటిని విడుదల చేసే దశకు తీసుకువచ్చింది. తాను ప్రారంభించిన ప్రాజెక్టుకు తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చి ప్రారంభోత్సవం చేయడం రాజకీయంగా అరుదైన పరిణామంగా చెప్పవచ్చు. వెలిగొండతో పాటు పోలవరం కూడా చంద్రబాబు...