మద్యం మానేసినా లివర్ ఎందుకు బాగుపడదు?.. అసలు కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు

హైదరాబాద్: మద్యపానం వల్ల కాలేయం దెబ్బతినడం తెలిసిందే. అయితే మద్యం పూర్తిగా మానేసిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తుల్లో లివర్ ఆరోగ్యం ఎందుకు మెరుగుపడటం లేదన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు కీలక సమాధానం కనుగొన్నారు. కాలేయ కణాలు పునరుత్పత్తి చెందే ప్రక్రియలో మధ్యలోనే నిలిచిపోవడం సమస్యకు ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. కాలేయానికి గాయం లేదా నష్టం జరిగినప్పుడు దాని కణాలు తిరిగి కొత్త కణాలను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని కణాలు తాత్కాలికంగా మూలకణాల మాదిరి స్థితికి వెళ్లి వేగంగా విభజన చెందుతాయి. అనంతరం తిరిగి సాధారణ కాలేయ కణాలుగా మారతాయి. అయితే అధిక మద్యపానం కారణంగా ఏర్పడే ఆల్కహాల్...