హైదరాబాద్లో 24 గంటలూ బస్సులు.. నేటి నుంచి 6 రూట్లలో నైట్ సర్వీసులు
హైదరాబాద్: నగరవాసులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 1 నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో నైట్ బస్సు సర్వీసులను పునఃప్రారంభించింది. రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఐటీ, హాస్పిటాలిటీ రంగాల్లో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ కారిడార్తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను కలుపుతూ మొత్తం 15 బస్సులతో సర్వీసులను ప్రారంభించారు. ప్రయాణికుల స్పందన, డిమాండ్ను బట్టి భవిష్యత్తులో...