హరీశ్రావును క్షమించినా.. ప్రశాంత్రెడ్డిని మాత్రం క్షమించను: కవిత
నిజామాబాద్: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి వ్యవహారాల కారణంగానే రెండు పార్టీలు ఒక అవగాహనతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మౌనం వహిస్తోందని అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని కవిత విమర్శించారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికీ సాగునీరు అందలేదని అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలనలో కొద్దిమంది కుటుంబాలకే ప్రయోజనం చేకూరిందని...