అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

ఆరోగ్యం క్షీణించడంతో ముంబయికి తరలింపు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో పాటు డీహైడ్రేషన్‌ సమస్య కిడ్నీల పనితీరుపైనా కొనసాగుతున్న పరీక్షలు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న 87 ఏళ్ల హజారే పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చికిత్స ముంబయి: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (87) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబయిలోని బాంబే ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం డాక్టర్‌ గౌతమ్‌ భన్సాలీ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, డీహైడ్రేషన్‌ కారణంగా హజారే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తొలుత రాలేగావ్‌ సిద్ధి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనను పరిస్థితి మెరుగుపడకపోవడంతో ముంబయికి తరలించారు. కిడ్నీల పనితీరుతో పాటు ఇతర...