భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం: వైట్‌హౌస్
7.8 శాతం జీడీపీ వృద్ధిపై ప్రశంసలు భారత్‌లో పెట్టుబడులకు అమెరికా కంపెనీలకు ప్రోత్సాహం వాణిజ్య ఒప్పంద చర్చలు సాంకేతిక దశకు చేరిక వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతూ పటిష్టంగా, స్థితిస్థాపకంగా ఉందని వైట్‌హౌస్ ప్రశంసించింది. 7.8 శాతం జీడీపీ వృద్ధి గణాంకాలు భారత్ వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వైట్‌హౌస్ సీనియర్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా అమెరికా కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని, అమెరికాలో భారత పెట్టుబడులను కూడా స్వాగతిస్తున్నామని తెలిపారు. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాంకేతిక దశకు చేరుకున్నాయని, నిపుణుల బృందాలు కీలక అంశాలపై చర్చిస్తున్నాయని...